: సర్‌ప్రైజ్ ఏంటో చెప్పేసిన రాం గోపాల్ వర్మ!


‘నా ట్విట్టర్ ఖాతా ఫాలోవర్స్ అందరికీ ఈ రోజు సాయంత్రం ఉల్లాసాన్నిచ్చే అప్రియమైన సర్ ప్రైజ్ చెబుతాను’ అని పేర్కొన్న ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌ వర్మ చెప్పిన‌ట్లుగానే ఆ విష‌యం ఏంటో తెలిపాడు. గతంలో ఆయ‌న‌ 'గన్స్ అండ్ థైస్' పేరుతో ఓ పుస్తకం విడుదల చేశారు. అయితే, అదే పేరుతో ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ తీసి, అందుకు సంబంధించిన ఓ ట్రైలర్‌ను అందులో ఉంచారు. తాను ఎన్నోసార్లు ముంబై మాఫియాకు సంబంధించిన రియ‌ల్‌ స్టోరీని చూపించాల‌నుకున్నాన‌ని, కానీ కొన్ని కారణాల వల్ల చూపించలేద‌ని, ఇప్పుడు వాటిని ఈ వెబ్ సిరీస్ లో చూపిస్తున్నాన‌ని తెలిపారు. ‘గన్స్ అండ్ థైస్.. ఏ సాగా ఆఫ్ ది ముంబై మాఫియా పేరిట’ విడుద‌ల‌ చేసిన ఈ ట్రైలర్‌లో ప‌లు క్రైమ్ సీన్లను చూపించారు వ‌ర్మ‌. ఇవి కాస్త భ‌యంక‌రంగానే ఉన్నాయి.









  • Loading...

More Telugu News