: యాంకర్ రవి పరిస్థితి చూస్తుంటే నాకు నవ్వొస్తోంది: ఎన్నారై అన్నపూర్ణ సుంకర


తెలుగు సినిమాల తీరును సోషల్ మీడియా ద్వారా నాడు ఏకిపారేసిన ఎన్నారై అన్నపూర్ణ సుంకర మరోమారు తెరపైకి వచ్చింది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం ఆడియో ఫంక్షన్ లో ఇటీవల పాల్గొన్న సినీ నటుడు చలపతిరావు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, యాంకర్ రవి ‘సూపర్, సార్’ అనడం తెలిసిందే. ఈ విషయమై చలపతిరావు క్షమాపణలు చెప్పడం, తన తప్పు లేదని యాంకర్ రవి పేర్కొనడం విదితమే. అయినప్పటికీ, మహిళా సంఘాలు మాత్రం మండిపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ సుంకర స్పందిస్తూ, యాంకర్ రవి పరిస్థితిపై అది అతని కర్మ అని అన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి యాంకర్ రవిని సోషల్ మీడియాలోకి, మీడియాలోకి లాగుతుంటే తనకు నవ్వొస్తోందని అన్నారు. కాగా, గతంలో అన్నపూర్ణ సుంకర పోస్ట్ చేసిన ఓ వీడియోకి యాంకర్ రవి ఘాటు రిప్లై ఇచ్చిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News