: అమిత్ షానే అవమానిస్తారా?.. మేమేంటో చూపిస్తాం: బీజేపీ నేత నాగం హెచ్చరిక


తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షానే అవమానిస్తారా? అంటూ ఆ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జోలికి, బీజేపీ నేతల జోలికి వస్తే ఊరుకోబోమని... తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. అమిత్ షా చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని అన్నారు. ప్రధాని మోదీతో పోల్చుకోవడం కేసీఆర్ కు సరికాదని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతే లేదని కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటని... ప్రభుత్వ అవినీతిపై చర్చకు తాము సిద్ధమని తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో రూ. 2,400 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. రూ. 50 కోట్ల విలువైన మోటార్ల విలువను రూ. 90 కోట్లకు పెంచారని తెలిపారు. 

  • Loading...

More Telugu News