: జయలలిత ఇల్లు ఇప్పుడు 'హంటెడ్ మాన్షన్'... లోపలికి వెళ్లేందుకూ భయమే!


నంబర్ 81, వేదనిలయం, పోయిస్ గార్డెన్స్... తమిళనాట ఈ చిరునామా గురించి తెలియని వారుండరు. మొన్నటి వరకూ రాష్ట్ర రాజకీయాలను శాసించిన చిరునామా ఇది. అమ్మ జయలలిత మరణం, ఆపై ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసిలు జైలుకు వెళ్లడంతో ఈ ఇల్లు ఇప్పుడు 'దయ్యాల కొంప'లా కనిపిస్తోంది. మూసివేసిన తలుపులు, కనిపించీ కనిపించని వెలుగులు, గుండుసూది కిందపడ్డా వినిపించేంత నిశ్శబ్దం ఇక్కడ రాజ్యమేలుతోంది. భవంతికి సెక్యూరిటీగా ప్రైవేటు సంస్థకు చెందిన గార్డులు కాపలా కాస్తున్నప్పటికీ, రాత్రిపూట గార్డు రూమును దాటి భవంతి వైపు అడుగులు వేసేందుకు వారు జంకుతున్న పరిస్థితి. ఈ భవంతిలోకి వెళ్లేవాళ్లు ఎవరూ లేరని, అసలిక్కడ ఎక్కువ సేపు ఉందామని కూడా ఎవరూ భావించడం లేదని ఇక్కడి సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.

పగటి సమయంలో కొంతమంది పనివాళ్లు వచ్చి భవన నిర్వహణ పనులు చూసుకుని రాత్రికి బయటపడిపోతున్నారు. వీరికి కూడా కొన్ని నెలలుగా జీతాలు రావడం లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి 15న శశికళ పరప్పన అగ్రహార జైలుకు వెళ్లిన తరువాత, చాలా మంది పనివారు మానేశారని, రాత్రిపూట ఇక్కడ ఉండటం క్షేమకరం కాదని వారంతా భావిస్తున్నారని రాత్రి పూట సెక్యూరిటీ గార్డుగా ఉన్న ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు. కాగా, ఈ భవంతిని జయలలిత స్మారక భవనంగా మార్చాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికైతే, జయలలిత మరణించి 5 నెలలు దాటుతుండగా, ఇప్పటికీ ఆమె ఆత్మ ఇక్కడే తిరుగుతోందని నమ్ముతున్న తమిళ ప్రజలు ఎందరో!

  • Loading...

More Telugu News