: ఈ విషయంలో చైనా, అమెరికాలను మరోసారి అధిగమించిన భారత్!
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రపంచంలోనే ఆకర్షణీయమైన దేశంగా భారత్ వరుసగా రెండో ఏడాది ప్రథమ స్థానంలో నిలిచింది. చైనా రెండో స్థానంలో నిలవగా, అమెరికా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 2016లో రూ. 4.05 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను భారత్ ఆకర్షించింది. ఫైనాన్షియల్ టైమ్స్ కు చెందిన ఎఫ్డీఐ ఇంటెలిజెన్స్ విభాగం ఈ వివరాలను వెల్లడించింది. బలమైన ఆర్థిక అభివృద్ధిని కనబరుస్తున్న దేశాలకు విదేశీ పెట్టుబడులు తరలి వెళుతున్నాయని తెలిపింది.