: అజ్మీర్ లో దారుణం...అందరూ చూస్తుండగా నలుగురు సిక్కు యువకులపై దాడి!


రాజస్థాన్ లోని అజ్మీర్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రముఖ ఆజ్మీర్ దర్గాను సందర్శించేందుకు వచ్చిన నలుగురు సిక్కు యువకులను స్థానికులు కిడ్నాపర్లుగా పొరపడ్డారు. దీంతో ఎలాంటి నిర్ధారణ లేకుండా పట్టపగలు అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద చితక్కొట్టారు. ఆర్తనాదాలు చేస్తున్నా ఎవరూ కనికరించలేదు. దీనిని చూసిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రోడ్డుపై పడిఉన్న బాధితులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. దాడి సందర్భంగా వీడియో తీసిన ఔత్సాహికుడు సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ అవుతోంది.  

  • Loading...

More Telugu News