: ట్రావెల్ బ్యాన్ పై ట్రంప్ కు మరో షాక్!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్, సోమాలియా, లిబియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాల ప్రజలపై ఆయన విధించిన ట్రావెల్ బ్యాన్ రాజ్యాంగ విరుద్ధమని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు స్పష్టం చేసింది. ఈ బిల్లులో జాతీయ భద్రతే లక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ... మతపరమైన వివక్ష, అసహనం, వ్యతిరేక ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును బలపరుస్తూ, ట్రంప్ ఆర్డర్ ను నిలిపివేసింది. అయితే, ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ట్రంప్ ప్రభుత్వం ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ సర్కారు నిషేధం విధించింది. ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో... జాబితా నుంచి ఇరాక్ ను మినహాయించారు.

  • Loading...

More Telugu News