: అవును, ఆ వెయ్యి రూపాయల కాయిన్ మేము విడుదల చేసిందే!: ఆర్బీఐ


నోట్ల రద్దు అనంతరం పది రూపాయల కాయిన్స్ రద్దయ్యాయంటూ పలు పుకార్లు షికార్లు చేశాయి. దీంతో పది రూపాయల నాణెం తీసుకునేందుకు అంతా సందేహించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కల్పించుకుని తాము పది రూపాయల నాణేలను రద్దుచేయలేదని, అలాంటి పుకార్లు నమ్మవద్దని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్బీఐ 1000 రూపాయల నాణేం విడుదల చేసిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో వెయ్యి రూపాయల నాణెం బొమ్మ దర్శనమిస్తోంది.

500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన ఆర్బీఐ పాత 500 నోట్ల స్థానంలో కొత్త నోట్లను తీసుకొస్తూ, 1000 రూపాయల కరెన్సీ ఉండదని, కొత్తగా 2000 రూపాయల నోట్లు ఉంటాయని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 1000 రూపాయల నాణెం దర్శనమివ్వడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో మరోసారి ఆర్బీఐ స్పందించింది. తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వరాలయం నిర్మించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, దాని సంస్మరణ నాణెంగా దీనిని విడుదల చేశామని ప్రకటించింది. 1000 రూపాయల నాణెం అధికారికమైనదేనని తేలింది.

  • Loading...

More Telugu News