: తప్పిపోయిన బాలికలు షారూక్ నివాసం ముందు పడిగాపులు!


వరుసకు కజిన్స్ అయ్యే మైనర్ బాలికలు ఆరుగురు తప్పిపోయారంటూ వారి తల్లిదండ్రులు ఈ నెల 23న మఘ్రల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు, ముంబయిలోని షారూక్ ఖాన్ నివాసం ముందు ఆ ఆరుగురు బాలికలు ఉండటాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మే 23వ తేదీ సాయంత్రం మఘ్రల్ లోని నండూరి ఆలయానికి వెళ్లి వస్తామని చెప్పి ఆరుగురు బాలికలు బయటకు వచ్చారని, నాసిక్ రోడ్ రైల్వేస్టేషన్ కు వెళ్లి శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో దాదర్ చేరుకున్నట్టు చెప్పారు. పోలీసుల బృందం ముంబయి చేరుకుని బాలికల కోసం గాలిస్తున్న క్రమంలో షారూక్ నివాసం ‘మన్నత్’ వద్ద వారిని గుర్తించామన్నారు. షారూక్ ఖాన్ ను కలిసేందుకని బాలికలు అక్కడికి వెళ్లారని, వారిని అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రులకు నిన్న అప్పగించినట్టు పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News