: ఆదాయాభివృద్ధి రేటులో మరోసారి అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం
ప్రధాన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో తెలంగాణ ప్రభుత్వం 17.82 శాతం వృద్ధి సాధించిందని, 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి వరకు కాగ్ వెల్లడించిన గణాంకాల ఆధారంగా ఈ రోజు సీఎంవో తెలిపింది. ఇక అన్ని రకాల పన్నుల ఆదాయంలో 17.81శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది. ప్రధానమైన అమ్మకం పన్ను, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.39,183 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపింది. దీంతో ఆదాయాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మరోసారి మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు రూ.36,130 కోట్ల ఆదాయం వచ్చిందని ఈ సారి మాత్రం మొత్తం రూ.42,564 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది.