: ప్రియుడి ఆత్మహత్యాయత్నం.. ఆ బుల్లెట్ ప్రియురాలికి తగిలి ఆమె మృతి!


ఓ యువకుడు తన తలకు తుపాకీ గురిపెట్టుకొని కాల్చుకోగా ఆ బుల్లెట్‌ అతడి పుర్రెపై భాగం నుంచి దూసుకెళ్లి ప‌క్క‌నే ఉన్న‌ ఓ యువ‌తికి తాకింది. దీంతో ఆ యువ‌తి మృతి చెందింది. ఈ ఘ‌ట‌న‌లో ఆ యువ‌కుడు మాత్రం గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇటీవ‌ల జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌స్తుతం ఈ కేసులో కోర్టులో విచార‌ణ కొన‌సాగుతోంది. ఇది సెకండ్‌ డిగ్రీ హత్యగా పేర్కొంటూ అమెరికా కోర్టు అతడిపై అభియోగాలు ఖరారు చేసింది. పూర్తి వివ‌రాలు చూస్తే... విక్టర్‌ సిబ్సన్ (21) అనే యువకుడు, బ్రిటనీ మే హాగ్‌ (22) అనే యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆ ప్రేమికుడు తుపాకీతో కాల్చుకోగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

అతడి ప్రియురాలు హాగ్‌ కణతలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో ఆసుప‌త్రికి తీసుకెళ్లినా ఆమె ప్రాణాలు నిల‌వ‌లేదు. పుర్రె పైభాగం నుంచి బుల్లెట్‌ దూసుకుపోయిన కారణంగా సిబ్స‌న్ కి ప్రాణాప్రాయం త‌ప్పింది. పోలీసులు జ‌రిపిన‌ విచారణలోనూ అధికారులు ఒకే బుల్లెట్‌ వారిద్దరి తలలోకి దూసుకెళ్లినట్లు తేలడంతో వారిద్దరు కలిసి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారా? అనే విష‌యంపై విచార‌ణ జ‌రుపుతున్నారు.                         

  • Loading...

More Telugu News