: విజయవాడలో అమిత్ షా ప్రసంగిస్తుండగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తల నినాదాలు
ఈ రోజు విజయవాడలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మహా సమ్మేళనం జరిగింది. ఇందులో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రసంగిస్తుండగా పలువురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. దీంతో ఎమ్మార్పీఎస్ వారు హడావుడి చేయకూడదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. తమపార్టీ ఎమ్మార్పీఎస్ డిమాండ్లపై సానుకూలంగానే ఉందని, వారి సమస్యలు తమ దృష్టికి వచ్చాయని ఇక్కడ హడావుడి చేయకూడదని కోరారు. అనంతరం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపుచేశారు.