: నేను అంత పెద్దవాడిని కాదు: సోము వీర్రాజు


సీఎం చంద్రబాబు పాలనకు మార్కులు వేసేంత పెద్దవాడిని కానని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. విజయవాడలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఈ రోజు కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో పలు పార్టీల నేతలు, ప్రముఖులు, నటులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పిన ఆయన, వారి పేర్లు మాత్రం వెల్లడించలేదు. పొత్తుల విషయమై ఏపీ బీజేపీ నేతల నుంచి అమిత్ షా అభిప్రాయాలు తెలుసుకుని తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. టీడీపీ నేతలు బీజేపీని విమర్శించడం, ఆ తర్వాత సీఎం ఖండించడం మామూలైపోయిందని అమిత్ షాకు ఆయన ఫిర్యాదు  చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News