: 103 ఏళ్ల ఆ అభిమాని కోరిక ఇప్పుడు నెరవేరింది.. ఆమెతో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన అమితాబ్
ఆమె వయసు 103 ఏళ్లు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కి ఆమె వీరాభిమాని. జీవితంలో ఒక్కసారైనా తన అభిమాన నటుడిని కలవాలని ఆమె ఎంతగానో ముచ్చటపడుతోంది. ఆమె ఆశ ఇప్పటికి తీరింది. ఇటీవలే అమితాబ్ ఆమెను కలిసి, ఓ ఫొటో దిగి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. అమితాబ్ ను కలిసిన ఆమె ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆ 103 ఏళ్ల బామ్మ పేరు క్రిస్టిన్. తనని ఇంత ఆప్యాయంగా పలకరించిన అమితాబ్ బచ్చన్‌కి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలిపింది. మొత్తానికి ఆ బామ్మ కోరిక ఈ వయసులో ఇలా నెరవేరింది. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు.
T 2433 - 103 yrs old Christine, my fan had wished to see me for years .. today I did ! SO sweet and cute ..blessed me too .. 103 years !! pic.twitter.com/76KUNjGvXj
— Amitabh Bachchan (@SrBachchan) 23 May 2017