: కోర్టు బోను ఎక్కనున్న అద్వాణీ.. తమ ముందు హాజరు కావాలంటూ కోర్టు ఆదేశం


బీజేపీ కురువృద్ధుడు అద్వాణీకి లక్నో సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. మే 30న తమ ముందు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 1992 డిసెంబర్ లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి కోర్టు ఈ మేరకు ఆదేశించింది. ఆయనతో పాటు మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలను కూడా అదే రోజున కోర్టుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో వీరికి ఎలాంటి మినహాయింపును ఇవ్వలేమని స్పష్టం చేసింది. నిందితులపై కుట్ర అభియోగాలు సహా అన్ని విధాలుగా విచారణ జరుపాతామని తెలిపింది. 

  • Loading...

More Telugu News