: తప్పిన పెను ప్రమాదం... గోడను ఢీకొని ఫడ్నవీస్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పడంతో కాసేపు అధికారులు టెన్షన్ పడ్డారు. ఈ ఉదయం టేకాఫ్ అయిన ఫడ్నవీస్ హెలికాప్టర్, సాంకేతిక లోపంతో ఎటు వెళ్లిందన్న విషయం తెలియరాలేదు. దీంతో అధికారులు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా, హెలికాప్టర్ లాతూరు సమీపంలో క్రాష్ ల్యాండ్ అయినట్టు తెలిసింది.
హెలికాప్టర్ ఇంజన్ లో లోపం కారణంగా పైలట్ దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో చాపర్ ఓ గోడను ఢీకొట్టింది. దీంతో దాని వెనుక భాగం తీవ్రంగా దెబ్బతింది. రెక్కలు విరిగిపోయాయి. తాను తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డానని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. హెలికాప్టర్లోని అందరూ క్షేమమేనని, వారిని క్షేమంగా దగ్గర్లోని పట్టణానికి తరలించామని పోలీసు అధికారులు తెలిపారు. ఇదే హెలికాప్టర్ లో పది రోజుల క్రితం కూడా సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.