: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీకి పెరగనున్న కష్టాలు!
బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి చిక్కులు మరింత పెరిగే అవకాశం ఉంది. బాబ్రీ మసీదును కూల్చివేసిన కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనపై రేపు మరిన్ని అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది. ఆయనతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమా భారతిలపై కూడా కొత్త అభియోగాలు నమోదు కావచ్చని సమాచారం. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో వీరిపై ఉన్న ఆరోపణలను అలహాబాద్ కోర్టు 2011లో కొట్టివేసింది. అయితే ఈ కేసును సుప్రీంకోర్టు గత నెలలో పునరుద్ధరించింది. ఏప్రిల్ 19న ఈ కేసును సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసులో ప్రతిరోజూ వాదనలు వినాలని, నెల రోజుల్లో విచారణ మొదలుపెట్టి, రెండేళ్లలోపు విచారణను ముగించాలని డెడ్ లైన్ విధించింది.