: పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో జూనియర్ ఎన్టీఆర్!
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు రంగం సిద్ధమవుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాసే... దీనికి కూడా సూత్రధారి. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోతున్న సినిమాకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. జూనియర్ తో ఆయన తీయబోయే సినిమా పొలిటికల్ బేస్డ్ థ్రిల్లర్ అట. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం 'జై లవకుశ'తో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ బిజీగా ఉన్నారు.