: బాలీవుడ్ సినిమా విడుదలను ఆపేయాలని కోరుతూ కోర్టు కెక్కిన అల్లు అరవింద్!


బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ‘వన్‌ నేనొక్కడినే’ ఫేమ్ కృతి సనోన్ జంటగా నటించిన ‘రాబ్తా’ సినిమా విషయంలో తెలుగులో వచ్చిన తమ ‘మగధీర’ కథను కాపీ కొట్టారని ఆరోపిస్తూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కోర్టు మెట్లెక్కారు. గతంలో ‘రాబ్తా’ ట్రైలర్‌ విడుదల సమయంలో ఇది తెలుగు ‘మగధీర’లా ఉందని కామెంట్లు వినిపించిన క్రమంలో తాజాగా, ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో నిర్మాత అల్లు అరవింద్ హైదరాబాదు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.

ఈ సందర్భంగా ‘రాబ్తా’ సినిమా విడుదలను ఆపేయాలని డిమాండ్ చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. జూన్‌ 9న ‘రాబ్తా’ విడుదల కానుంది.  

  • Loading...

More Telugu News