: పైసలిస్తేనే 'పవర్'... ఉంచాలా? ఆపాలా?: తెలంగాణకు ఏపీ అల్టిమేటం


విద్యుత్‌ పెండింగ్‌ బకాయిలను ఈ నెలాఖరులోపు చెల్లించకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని ఏపీ జెన్ కో ఎండీ తెలంగాణ జెన్ కో కు తేల్చిచెప్పారు. ఏపీ ట్రాన్స్ కో నుంచి తెలంగాణకు ప్రతి రోజూ పది మిలియన్‌ యూనిట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. ఇలా సరఫరా అవుతున్న విద్యుత్ కు తెలంగాణ పెద్ద మొత్తంలో బకాయి పడింది. ఈ బకాయి 2014 నుంచి ఇప్పటి వరకు 4,800 కోట్ల రూపాయలని ఏపీ ట్రాన్స్ కో తెలపగా, ఆ లెక్క సరికాదన్న తెలంగాణ విద్యుత్ సంస్థలు... చర్చల అనంతరం 3,200 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తామని తెలిపాయి.

దీనికి ఏపీ అంగీకరించినప్పటికీ ఇంకా ఆ మొత్తాన్ని చెల్లించలేదు. దీంతో ఏపీ జెన్ కో ఎండీ తెలంగాణకు లేఖ రాశారు. బకాయిలను ఈ నెల 31 లోగా చెల్లించాలని, లేకుంటే విద్యుత్‌ సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించారు. అవసరమైతే చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడేది లేదని స్పష్టం  చేశారు.  

  • Loading...

More Telugu News