: ఢిల్లీ రాష్ట్ర మంత్రులను కలవాలంటే ముందస్తు అనుమతి అవసరం లేదు!


ఢిల్లీలో మంత్రులను, అధికారులను కలవాలనుకునే ప్రజలకు ఇకపై ఎటువంటి ముందస్తు అనుమతులు అవసరం లేదని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రతిరోజూ ప్రజల కోసం ఒక గంట సమయం కేటాయించాలని ఈ మేరకు సహచర మంత్రులను కేజ్రీవాల్ ఆదేశించారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఈ రోజు తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య మంత్రులను, అధికారులను ప్రజలు కలసుకోవచ్చని, అందుకు, ఎటువంటి ముందస్తు అనుమతులు అవసరం లేదని చెప్పారు. ఆ సమయంలో ఎటువంటి సమావేశాలు పెట్టుకోవద్దని కేజ్రీవాల్ ఆదేశించినట్టు పేర్కొన్నారు. కాగా, సమస్యలు చెప్పుకునేందుకు అధికారులు అందుబాటులో ఉండటం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సిసోడియా పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News