: పరేష్ రావల్ పై సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలు ధ్వజం


కశ్మీర్ లో ఆర్మీ జీపుకు స్థానిక యువకుడిని కాకుండా అరుంధతీ రాయ్ ను కట్టేసి ఉండాల్సిందంటూ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ పరేష్ రావల్ చేసిన వ్యాఖ్యలను అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు షైనా ఎన్ సీ ఖండించారు. అరుంధతీ రాయ్ సిద్ధాంతాలు ఎలాంటివైనా సరే... ఈ వివాదంలోకి ఓ మహిళను లాగడం ఎందుకని అన్నారు. తన సొంత అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు పరేష్ రావల్ కు ఉందని... అయితే మహిళల గురించి మాట్లాడే ముందు ఆలోచించాలని చెప్పారు. మరోవైపు బీజేపీకే చెందిన మరో నేత ఎస్ ప్రకాష్ మాత్రం పరేష్ రావల్ కు మద్దతు పలికారు. అనేక విషయాలపై పరేష్ రావల్ ట్విట్టర్ లో స్పందిస్తుంటారని... లేనిపోని విమర్శలు చేయడం మంచిది కాదని అన్నారు. 

  • Loading...

More Telugu News