: తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షనేతల ఫోన్లను ట్యాప్ చేస్తోంది: సండ్ర వీరయ్య ఆరోపణ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ పాలన నీరో చక్రవర్తిని తలపిస్తోందని, ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను గౌరవించడం లేదని, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చించకుండా తమ గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. గతంలో ఎవరూ వాడని విధంగా పోలీస్ వ్యవస్థను వాడుతున్నారని, ప్రజల మధ్య అశాంతి నెలకొల్పి శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని, మంచి పోస్ట్ ల కోసం కొందరు పోలీసు అధికారులు ప్రభుత్వానికి వంతపాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవులు, కళాకారులు గళం విప్పాలని కోరారు.