: సెక్యూరిటీని తగ్గించి.. టార్గెట్ చేస్తున్నారు: మిథున్ రెడ్డి
టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. హత్యారాజకీయాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. వైసీపీ నేతలకు ముప్పు ఉన్నప్పటికీ, సెక్యూరిటీని తగ్గిస్తున్నారని... ఆ తర్వాత టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. పత్తికొండ వైసీపీ ఇన్ ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డిని కూడా ఇలాగే హతమార్చారని చెప్పారు. రివాల్వర్ లైసెన్స్ ను రెన్యువల్ చేయాలని ఆయన దరఖాస్తు చేసుకున్నా... రెన్యువల్ చేయలేదని చెప్పారు. ఆ తర్వాత స్కెచ్ వేసి ఆయనను నరికి చంపారని విమర్శించారు. టీడీపీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోయిందని... అందుకే ఇలాంటి రాజకీయాలు చేస్తోందని అన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని పక్కన పెట్టేశారని... గ్రామాల్లోని ప్రజలకు మంచినీళ్లు కూడా అందడం లేదని తెలిపారు.