: పన్ను ఎగ్గొట్టిన యూపీ ఐఏఎస్ అధికారులపై కొరడా ఝళిపించిన ఐటీ శాఖ


ఆదాయపు పన్నును ఎగ్గొట్టారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఐటీ శాఖ కొరడా ఝళిపించింది. ఇద్దరు ఐఏఎస్ అధికారులు సహా నలుగురు ఉన్నతాధికారులు, వారి బంధువులకు చెందిన 15 చోట్ల ఈ ఉదయం నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. లక్నో, నోయిడా, గ్రేటర్ నోయిడా, మీరట్, భాగ్ పత్, మణిపురి, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. యూపీ ఆరోగ్య విభాగం డైరెక్టర్ హృదయ్ శంకర్ తివారీ, గ్రేటర్ నోయిడా అథారిటీ అదనపు సీఈఓ వీకే శర్మ, ఆయన భార్య, రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ మమతా శర్మ, జైళ్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి వీకే సింగ్ నివాసాలపై ఈ సోదాలు జరుగుతున్నాయి. గత నెలలో కూడా ఇదే తరహాలో కొందరు అధికారుల ఇళ్లలో ఐటీ దాడులు జరుగగా, భారీ ఎత్తున నల్లధనం బయటపడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News