: మా డాడీకి హ్యాపీయెస్ట్‌ మ్యూజికల్‌ బర్త్‌డే: దేవిశ్రీ ప్ర‌సాద్


సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్రసాద్ త‌న‌ తండ్రికి హ్యాపీ బ‌ర్త్ డే అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ రోజు ఆయ‌న తండ్రి సత్యమూర్తి జయంతి సంద‌ర్భంగా గ‌తంలో తాను త‌న తండ్రితో కలసి దిగిన ప‌లు ఫొటోలను అభిమానుల‌తో పంచుకున్నాడు. త‌న హీరో, త‌న శ‌క్తి, త‌న ప్రేమ‌, ఆత్మ‌విశ్వాసం, త‌న ధైర్యం అంతా త‌న తండ్రేన‌ని దేవిశ్రీ పేర్కొన్నాడు. త‌న‌ డాడీకి హ్యాపీయెస్ట్‌ మ్యూజికల్‌ బర్త్‌డే అని, లవ్యూ అండ్‌ మిస్‌ యూ డాడీ అని దేవిశ్రీ అన్నాడు. జీవితంలో త‌న‌కు అన్నీ ఇచ్చినందుకు త‌న తండ్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నాడు. టాలీవుడ్‌లో అగ్ర‌హీరోలందరి సినిమాల‌కు అద్భుత‌మైన సంగీతాన్ని అందించి, అగ్ర సంగీత ద‌ర్శ‌కుడు అనిపించుకుంటున్న దేవిశ్రీ ప్ర‌స్తుతం అల్లు అర్జున్ న‌టిస్తోన్న‌ 'దువ్వాడ జగన్నాథమ్' సినిమాకు సంగీతం అందిస్తూ బిజీబిజీగా ఉన్నాడు.




  • Loading...

More Telugu News