: ఒక మ్యూజిక్ డైరెక్టర్ పై మనసు పడ్డాను...కలిసి తిరిగాను కూడా!: శ్రుతి హాసన్‌


ఒక మ్యూజిక్ డైరెక్టర్ ను బాగా ఇష్టపడ్డానని ప్రముఖ సినీ నటి శ్రుతి హాసన్‌ చెప్పింది. ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ... గతంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ను చాలా ఇష్టపడ్డాను. ఆయన చాలా మంచి వ్యక్తి. మేమిద్దరం చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేవాళ్లం. దానినే నేను ప్రేమ అనుకున్నాను...అయితే నాది ప్రేమ కాదు ఆకర్షణ అని తరువాత తెలిసింది' అని చెప్పింది. రిలేషన్ బ్రేకప్ అయిన తరువాత దానిని తాను అర్థం చేసుకున్నానని చెప్పింది. ఆ తర్వాత ఇక ఎవరితోనూ ఆ తరహా రిలేషన్ పెట్టుకోలేదని చెప్పింది.

ప్రస్తుతానికి తనకు బాయ్ ఫ్రెండ్ కి కేటాయించేంత టైమ్ లేదని చెప్పింది. పెళ్లి గురించి కూడా ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని తెలిపింది. పిల్లల్ని కనాలంటే పెళ్లి చేసుకోవాలన్న రూల్ ఏమీ లేదని, తనకు ఒక వ్యక్తి నచ్చితే అతనితో పిల్లల్ని కంటానని చెప్పింది. ఈ విషయంలో తన తల్లిదండ్రులే ఆదర్శమని చెప్పింది. వారి ప్రభావం తనపై ఉంటుందని పేర్కొంది. తన గురించి వచ్చే రూమర్లను తన కుటుంబం పట్టించుకోదని వెల్లడించింది. తానేదైనా చెబితే దానిని గురించి ఆలోచిస్తారని చెప్పింది. అయితే ఇంతకీ శ్రుతి హాసన్‌ ప్రేమించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా? అని కోలీవుడ్ జనాలు ఆరాతీయడంలో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News