: పాక్ పై ఎలా విరుచుకుపడ్డా వెన్నుదన్నుగా నిలుస్తాం: సైన్యానికి జైట్లీ అభయం
వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్థాన్ దుర్మార్గాలను అడ్డుకునేలా సైన్యం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభయమిచ్చారు. బీఎస్ఎఫ్ దళాలకు వెన్నుదన్నుగా నిలుస్తామని తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెడుతూ, జమ్మూ కాశ్మీర్ లో శాంతి నెలకొనాలంటే, పాక్ పై చర్యలు తీసుకోక తప్పదని జైట్లీ అభిప్రాయపడ్డారు. సరిహద్దుల వెంట చొరబాటు యత్నాలను అడ్డుకోవాలని, ఈ దిశగా కౌంటర్ టెర్రరిజం చర్యలు సమర్థవంతంగా చేపట్టాలని జైట్లీ పిలుపునిచ్చారు. కాగా, నౌషేరా సెక్టారులో పాక్ పోస్టులను ధ్వంసం చేస్తున్న వీడియోలను భారత సైన్యం విడుదల చేయగా, పాకిస్థాన్ దాన్ని ఖండించిన సంగతి తెలిసిందే.