: స్మృతీ ఇరానీకి షాక్... ఆమె విద్యార్హతల రికార్డులు సమర్పించమన్న హైకోర్టు!


కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి షాక్ తగిలింది. సమసిపోయిందనుకున్న ఆమె నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. 2004లో ఎన్నికల అఫిడవిట్‌ లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పాసైనట్లుగా ఆమె తన విద్యార్హతలను పేర్కొన్నారు. అయితే, ఆ తరువాతి ఎన్నికల్లో ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకాం కరస్పాండెన్స్ ద్వారా పూర్తి చేసినట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారంటూ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి న్యాయస్థానంలో కేసు వేశారు.

తప్పుడు ధ్రువపత్రాలతో ఆమె డిగ్రీ పూర్తి చేయకుండానే చేసినట్లు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. దీనిని విచారించిన ఢిల్లీ దిగువ కోర్టు సరైన ఆధారాలు లేవంటూ ఆ కేసును కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఆమె విద్యార్హతకు సంబంధించిన అన్ని రికార్డులను తమకు సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటికే ఆమె అఫిడవిట్లు న్యాయస్థానం వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

  • Loading...

More Telugu News