: తెలంగాణలో మా పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్


భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, ఇదే స‌మ‌యంలో ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ తెలంగాణలో గ్రూపు రాజకీయాలు ఎక్కువని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని తాను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాన‌ని చెప్పారు. ఈ గ్రూపుల వల్ల త‌మ పార్టీకి నష్టం జరుగుతుందని కూడా వివ‌రించిన‌ట్లు పేర్కొన్నారు. అలాగే త‌న గోషామ‌హ‌ల్‌ నియోజకవర్గంలో త‌న‌కు తెలియకుండానే బీజేపీ కమిటీలు వేశారని ఆయ‌న అన్నారు. అందులో గత ఎన్నికల్లో త‌న‌కు వ్యతిరేకంగా పని చేసిన వాళ్లకు పార్టీ పదవులు ఇచ్చార‌ని ఆయ‌న చెప్పారు. ఈ విష‌యాలన్నింటిపైన అమిత్ షాతో చ‌ర్చించాన‌ని చెప్పారు.              

  • Loading...

More Telugu News