: జూబ్లిహిల్స్ లోని వస్త్ర దుకాణంలో సందడి చేసిన రాజమౌళి కుటుంబం
హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణంలో ఈ రోజు దర్శకుడు రాజమౌళి కుటుంబం సందడి చేసింది. ఆ షాపు యజమాని కృష్ణ... రాజమౌళి సతీమణి రమా రాజమౌళితో కలిసి కాస్ట్యూమ్స్ విభాగంలో పనిచేశారు. దీంతో రాజమౌళి కుటుంబం ఈ వస్త్ర దుకాణానికి విచ్చేసి, అక్కడి వస్త్రాలను పరిశీలించింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి, రమా రాజమౌళి, శ్రీవల్లి, కల్యాణ్‌మాలిక్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. తమ దుకాణంలోని వస్త్రాల గురించి రాజమౌళికి కృష్ణ వివరించి చెప్పారు.