: అంతా అస‌త్యం.. భార‌త‌ ఆర్మీ మాపై దాడులు చేయ‌లేదు: పాకిస్థాన్


నియంత్రణ రేఖ వెంబ‌డి ఉన్న పాకిస్థాన్ శిబిరాల‌పై భార‌త ఆర్మీ రెండు రోజులు దాడులు చేసిన‌ట్లు ఈ రోజు మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అశోక్ నరులా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం రాకెట్ లాంఛ‌ర్లు, యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్‌ వంటివి కూడా ఉప‌యోగించామ‌ని ఆయ‌న చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆర్మీ విడుద‌ల చేసింది. అయితే, భార‌త్ చేసిన ఈ ప్ర‌క‌ట‌న‌పై పాకిస్థాన్ ఆర్మీ స్పందిస్తూ అస‌లు దాడులే జ‌ర‌గ‌లేద‌ని పేర్కొంది. పాకిస్థాన్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఆసిఫ్ ఘ‌ఫూర్.. ఈ అంశంపై స్పందిస్తూ.. ఎల్‌వోసీ వెంట ఉన్న నౌషెరాలోని త‌మ స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు భార‌త్ చేస్తోన్న వ్యాఖ్య‌లు అంతా అస‌త్య‌మేన‌ని అన్నారు. గతంలో భారత్ పీవోకేలో సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సందర్భంలోనూ పాక్ ఇదే విధంగా స్పందించిన విషయం తెలిసిందే.            



  • Loading...

More Telugu News