: ఏడుగురు తమిళ నటులపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ!
తమిళ సినీ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అంశం తమిళనాడును ఊపేస్తోంది. ఇదే సమయంలో ఏడుగురు తమిళ సినీ ప్రముఖులపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువునష్టం కేసుకు సంబంధించి హీరో సూర్య, హీరోయిన్ ప్రియ ఆనంద్, నటులు శరత్ కుమార్, సత్యరాజ్, కమెడియన్ వివేక్, వర్ధమాన నటుడు అరుణ్ విజయ్, దర్శకుడు చరణ్ లకు నీలగిరి జిల్లా కోర్టు వారెంటు జారీ చేసింది. జర్నలిస్టులను కించపరిచారంటూ వీరందరిపై కేసు నమోదైంది. పాత్రికేయ సంఘాలు వీరిపై కేసు వేశాయి. ఈ కేసును విచారించిన కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఒకేసారి ఏడుగురు సినీ ప్రముఖులకు వారెంట్ జారీ కావడం కలకలం రేపుతోంది.