: రెడ్మి4 బుకింగ్ లు ప్రారంభం... ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన కొన్ని నిమిషాల‌కే అమెజాన్ వెబ్, యాప్ క్రాష్


చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమి నుంచి విడుదలయ్యే రెడ్మి స్మార్ట్‌ఫోన్‌ల‌పై భార‌త యువ‌త ఎంత‌గా మ‌క్కువ క‌న‌బ‌రుస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన కొన్ని నిమిషాల‌కే అవ‌న్నీ హాట్‌కేకుల్లా అమ్ముడు పోతాయి. ఈ రోజు మధ్యాహ్నం అమెజాన్‌లో రెడ్మి 4 ఫ్లాష్ సేల్ ప్రారంభమైంది. ఎవరు ముందుగా బుక్‌చేసుకుంటే వారికే ఈ ఫోన్ సొంతం అవుతుండ‌డంతో ఈ ఫోన్ కోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వెబ్ సైట్, మొబైల్ యాప్ ల ద్వారా ఆర్డర్ చేసుకోవడానికి యువ‌త ఒక్క‌సారిగా ఎగ‌బ‌డింది.

దీంతో ఆ రెండూ క్రాష్ అయ్యాయి. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ల బుకింగ్‌లు ఆరంభం అయిన మరుక్షణమే అధిక సంఖ్య‌లో యూజ‌ర్లంద‌రూ ఆర్డ‌రు చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో ఈ స‌మ‌స్య ఏర్ప‌డింద‌ని అమెజాన్ పేర్కొంది. దీంతో కాసేపు అయ్యాక త‌మ వినియోగ‌దారులు తిరిగి ప్రయత్నించాల‌ని అమెజాన్ త‌మ‌ వెబ్ సైట్ లో, యాప్ లో ఓ మెసేజ్ ఉంచింది. ఈ రోజు విడుద‌లైన‌ రెడ్మి 4 స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్/ 16జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 6,999 రూపాయలుగా ఉండ‌గా, 3జీబీ వేరియంట్/32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 రూపాయలుగా ఉంది.

  • Loading...

More Telugu News