: పాక్ స్థావరాలపై మరోసారి భారత ఆర్మీ దాడులు.. ప్రకటన చేసిన మేజర్ జనరల్!
తరుచూ సరిహద్దు వద్ద దాడులకు దిగుతూ రెచ్చిపోతున్న పాకిస్థాన్‌కు, సరిహద్దుల్లోంచి దూసుకొస్తూ దాడులకు దిగుతున్న ఉగ్రవాదులకు భారత ఆర్మీ మరోసారి గట్టిగా బుద్ధి చెప్పింది. నౌషెరా ప్రాంతంలోని పాక్ శిబిరాలపై ఈ నెల 20, 21 తేదీల్లో స్పెషల్ టెర్రర్ ఆపరేషన్ పేరిట దాడులు నిర్వహించామని భారత ఆర్మీ అధికారులు ఈ రోజు అధికారిక ప్రకటన చేశారు. జమ్ముకశ్మీర్‌లో శాంతిభద్రతలను పరిరక్షించడమే తమ ఉద్దేశమని, అందులో భాగంగానే దాడులు చేశామని చెప్పారు. పాక్ ఆర్మీ చొరబాటుదారులను ప్రోత్సహిస్తోందని మేజర్ జనరల్ అశోక్ నరులా అన్నారు. నౌషెరాలోని పాక్ పోస్టులను ధ్వంసం చేశామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు.