: 'రజనీకాంత్! మన ఊరికి వచ్చేయప్పా' అంటున్న గ్రామస్తులు!


తమ ఊరి బిడ్డ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడెప్పుడు స్వగ్రామానికి వస్తాడా అని నాచ్చికుప్పం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కృష్ణగిరి జిల్లా (తమిళనాడు)లో ఈ గ్రామం ఉంది. సుమారు 500 కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. తన తల్లిదండ్రుల గ్రామం ఇదేనని రజనీ ఇటీవలే ప్రకటించారు.

రజనీకాంత్ తండ్రి రాణేజిరావ్ ఈ గ్రామంలోనే జన్మించారు. ఉద్యోగం కోసం కర్ణాటకలోని కనకపుర తాలూకా సోమనహళ్లి గ్రామానికి వలసవెళ్లారు. అక్కడ రామాబాయ్ ని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి జన్మించారు. వారిలో ఒకరైన శివాజీరావ్ (రజనీకాంత్) సినిమాల్లోకి ప్రవేశించారు. రజనీ పూర్వీకులు మరణించిన తర్వాత 40 ఏళ్లుగా వారి ఇళ్లు శిథిలావస్థకు చేరాయి.

గతంలో రజనీ సోదరుడు సత్యనారాయణన్ తన పూర్వీకుల ఇంటికి సమీపంలో రెండెకరాల భూమిని కొనుగోలు చేసి, తన తల్లిదండ్రుల స్మారకార్థం తాగునీటి తొట్టెలు నిర్మించారు. పాఠశాల, కల్యాణమంటపాన్ని కూడా నిర్మించాలని అనుకున్నప్పటికీ... కరవు ప్రాంతం కావడంతో, ఆ పనులను చేపట్టలేకపోయారు. ఏదేమైనప్పటికీ తన స్వగ్రామం గురించి రజనీ ఇటీవల ప్రస్తావించిన నేపథ్యంలో... తమ గ్రామానికి విచ్చేయాలని రజనీకి ఆయన గ్రామస్తులు విన్నవిస్తున్నారు.

  • Loading...

More Telugu News