: జగన్ కు 200 ఏళ్లు జైలు శిక్ష పడాలి: కేశినేని నాని
వైసీపీ అధినేత జగన్ పై విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను బంగాళాఖాతంలో కలిపేయాలని అన్నారు. రూ. 60 కోట్ల కుంభకోణానికే శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిందని.... ఈ రకంగా చూసుకుంటే లక్ష కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్ కు 200 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని జోస్యం చెప్పారు. హత్యా రాజకీయాలను, శవ రాజకీయాలను జగన్ మానుకోవాలని సూచించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్యకు సంబంధించి చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తిలపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ పై కేశినేని విమర్శలు గుప్పించారు.