: చలపతిరావు వ్యాఖ్యలను ఖండిస్తున్నా.. ఆ అమర్యాదకర వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదు!: నాగార్జున


'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో వేడుకలో ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు మహిళపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ సినిమా నిర్మాత, సినిమా హీరో నాగచైతన్య తండ్రి అయిన ప్రముఖ నటుడు నాగార్జున క్షమాపణలు చెప్పాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నాగార్జున స్పందించారు.

 తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించిన నాగార్జున...వ్యక్తిగతంగా తాను మహిళలను గౌరవిస్తానని అన్నారు. అలాగే తన సినిమాల్లో కూడా మహిళల గౌరవానికి తగ్గదని చెప్పారు. తాను కచ్చితంగా చలపతిరావు వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, ఆయన చేసిన అమర్యాదకర వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని స్పష్టం చేసిన ఆయన...డైనోసార్స్ డు నాట్ ఎగ్జిస్ట్ అని అన్నారు.

  • Loading...

More Telugu News