: సినీ నటుడు చలపతిరావుపై జూబ్లీహిల్స్ పీఎస్ లో కేసు నమోదు!
ప్రముఖ సినీ నటుడు చలపతిరావుపై పోలీసు కేసు నమోదైంది. మహిళలను కించపరిచే విధంగా చలపతిరావు వెకిలి వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పీఎస్ లో మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాయి. ఈ సందర్భంగా మహిళా సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ, చలపతిరావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలు కేవలం పడకకే పనికొస్తారనే విధంగా నీచమైన వ్యాఖ్యలు చేసిన చలపతిరావుపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆయనపై పెట్టిన కేసును ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోబోమని చెప్పారు.