: పురంధేశ్వరితో భేటీ వెనుక ఉన్న కారణాన్ని వివరించిన ఆర్.కృష్ణయ్య
బీజేపీ నాయకురాలు పురంధేశ్వరితో భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని టీటీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. తన కుమారుడి వివాహానికి ఆమె హాజరుకాలేకపోయారని... అందుకే, నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు ఆమె తమ ఇంటికి వచ్చారని చెప్పారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని... డీఎస్సీని కూడా ప్రకటించకుండా మోసం చేస్తోందని విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని... లేకపోతే జూన్ రెండవ వారం నుంచి ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.