: అలాంటి అవకాశం వస్తే వదులుకునే ప్రశ్నే లేదు: రోహిత్ శర్మ


ఐపీఎల్ లో విజయవంతమైన కెప్టెన్ గా నిలిచిన రోహిత్ శర్మ ప్రశంసల్లో తడిసి ముద్దవుతున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్  గా రోహిత్ శర్మ తమ జట్టుకు 2013, 2015, 2017లో ట్రోఫీని అందించాడు. ఈ మూడు సీజన్లలో కీలక ఇన్నింగ్స్ లు ఆడిన రోహిత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో టీ20ల్లో విజయవంతమైన కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మకు టీమిండియా టీ20 జట్టు పగ్గాలు అప్పగిస్తే, కోహ్లీపై ఒత్తిడి తగ్గడంతో పాటు, జట్టును విజయపథంలో నడిపిస్తాడన్న చర్చ నడుస్తోంది. దీనిపై రోహిత్ శర్మను ప్రశ్నిస్తే... తాను అంత దూరం ఆలోచించలేదని చెప్పాడు. తనకు మరీ అంత ముందుచూపు ఉండదని తెలిపాడు. అయితే తనకు అలాంటి అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోనని అన్నాడు. టీమిండియాకు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని ఎవరు వదులుకుంటారని ఆయన ప్రశ్నించాడు. 

  • Loading...

More Telugu News