: నువ్వు ఎవరని అడిగితే.. ‘నేను మహేష్‌బాబుని’.. అంటున్న అల్లు అర్జున్ కుమారుడు!
హీరో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్‌కి హీరో మహేష్ బాబు అంటే బాగా ఇష్టమేమో. ముద్దుముద్దుగా మాటలు పలుకుతున్న ఆ చిన్నారి నీ పేరేంటి? అని అడిగితే అయాన్ అన్నాడు. అనంతరం నువ్వు ఎవరని అడిగితే మాత్రం ‘మహేష్‌బాబు’ అంటున్నాడు. ఇంట్లో అయాన్ తన చిన్న సైకిల్ తొక్కుతుండగా ఎవరో ఈ ప్రశ్నలు వేశారు. అందుకు సమాధానంగా అయాన్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు.