: రహదారిపై అరగంటసేపు ఫుట్ బాల్ ఆడుకున్న ఏనుగు.. నిలిచిపోయిన వాహనాలు
నడిరోడ్డుపైకి ప్రవేశించిన ఓ ఏనుగు అక్కడ దానికి కనిపించిన ఓ ప్లాస్టిక్ డబ్బాను చూసి దాన్ని ఫుట్‌బాల్‌లా కాలుతో తన్నుతూ ఆడుకుంది. అసోంలోని ఓ ప్రాంతంలో ఇటీవల కనిపించిన ఈ దృశ్యాన్ని కొందరు తమ సెల్‌ఫోన్‌లలో బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ రోడ్డుకు ఇరు పక్కలా ఉన్న అడవి నుంచి ఆ ఏనుగు వచ్చి, ఇలా ఫుట్‌బాల్ ఆడుకోవడంతో ఆ దారిలో వెళ్లే వాహనాలన్నీ నిలిచిపోయాయి. ఆ డబ్బాతో అరగంట పాటు ఏనుగు ఇలా ఫుట్‌బాల్ ఆడుకుంది. రోడ్డుకి అటువైపు ఆ డబ్బాను తన్నుతూ వెళుతున్న ఏనుగు, మళ్లీ ఆ డబ్బాను రోడ్డుకి ఇటువైపుకి తన్నుతోంది. ఈ ఆసక్తికర వీడియోను మీరూ చూడండి...