: ఐపీఎల్ టైటిల్ తో కొత్త రికార్డును నెలకొల్పిన రోహిత్ శర్మ!


ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్, టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ అత్యధిక టీ20 ట్రోఫీలు గెల్చుకున్న ఆటగాడిగా నిలిచాడు. నిన్న రైజింగ్ పూణే సూపర్ జెయింట్ తో జరిగిన మ్యాచ్ ను ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన రోహిత్ సేన, టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ పేరిట కొత్త రికార్డు నమోదైంది.

రోహిత్ శర్మ వరల్డ్ కప్ టీ20 సాధించిన టీమిండియాలో, ఆసియా కప్ టీ20 టోర్నీలో, ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ గెల్చుకున్న టీమిండియాలో సభ్యుడు, అలాగే ముంబై ఇండియన్స్ తరపున మూడు సార్లు టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడు, ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన డెక్కన్ ఛార్జర్స్ జట్టులో సభ్యుడన్న సంగతి తెలిసిందే. దీంతో అత్యధిక టీ20 టోర్నీలు గెలుచుకున్న భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అతని తరువాతి స్థానాల్లో మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, అంబటి రాయుడులంతా ఆరేసి టీ20 టోర్నీలు గెల్చుకున్న జట్లలో సభ్యులు కావడం విశేషం. 

  • Loading...

More Telugu News