: నా కూతురు అలా పోజులు కొట్టిన సంగతి నాకు తెలియదు: ఐశ్వర్య రాయ్


బాలీవుడ్ న‌టి ఐశ్వ‌ర్య రాయ్‌ కేన్స్ వేడుక‌ల్లో పాల్గొనేందుకు వెళుతున్న స‌మ‌యంలో విమానాశ్ర‌యంలో త‌న కూతురు, భ‌ర్త‌తో క‌నిపించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆమె కూతురు ఆరాధ్య ఫొటోల‌కు పోజులివ్వ‌డం అభిమానుల‌ను ఆక‌ర్షించింది. అయితే, త‌న కూతురు త‌న ప‌క్క‌నే ఉండి పోజులిస్తున్న‌ప్ప‌టికీ ఆ విష‌యాన్ని ఐశ్వ‌ర్య రాయ్ గ‌మ‌నించలేకపోయింద‌ట‌. త‌న కూతురు న‌డుంపై చేయి పెట్టి ఓ మోడ‌ల్‌లా ఇచ్చిన పోజులు మీడియాలో, సోష‌ల్ మీడియాలో వ‌చ్చాకే ఆ విషయం త‌న‌కు తెలిసింద‌ని ఐష్ చెప్పింది. ఆ విష‌యం తెలుసుకొని తాను ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్లు కూడా తెలిపింది. తాను త్వరగా వెళ్లాలనే హడావుడిలో ఉండి, ఆరాధ్య అలా పోజులిచ్చిన‌ సంగతిని అసలు కనిపెట్టనేలేదని తెలిపింది. సెకన్ల వ్యవధిలోనే త‌న కూతురు భలే స్టైల్‌గా పోజిచ్చిందని ఆమె హ‌ర్షం వ్య‌క్తం చేసింది. త‌న‌కు కూడా భ‌లే ముచ్చటేసిందని తెలిపింది.                                            

  • Loading...

More Telugu News