: ఆడియో ఫంక్షన్‌లో అమ్మాయిల పట్ల సీనియర్ నటుడు చలపతిరావు వెకిలి వ్యాఖ్యలు!
అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న ‘ రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో వేడుకను నిన్న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా సీనియర్ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు అలజడి రేపాయి. యువతులపై ఆయన చేసిన వ్యాఖ్యలపట్ల సోషల్ మీడియాలో యూజర్లు మండిపడుతున్నారు.
'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ట్రైలర్ లో రకుల్‌ప్రీత్ సింగ్‌ను ఉద్దేశించి చైతూ ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అంటూ ఓ డైలాగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ డైలాగ్ పై అభిప్రాయాన్ని తీసుకుంటున్న ఓ యాంకర్ చలపతిరావు వద్దకు వచ్చి, 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా?' అని ప్రశ్నించింది. పెద్ద వయస్కుడయిన చలపతి రావు అందుకు షాకింగ్ సమాధానం ఇచ్చారు. రాయడానికి కూడా వీలులేని ఆ సమాధానం పట్ల నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.