: అమిత్ షా పర్యటన వెనకున్న అసలు కారణం ఇదే: వీహెచ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజుల తెలంగాణ పర్యటన నిమిత్తం హైదరాబాద్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శలు గుప్పించారు. 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగానే అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చారని వీహెచ్ విమర్శించారు. కాంగ్రెస్ నేతల ఇళ్లకు బీదర్ ఎంపీని కూడా పంపారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బీసీలను ఆకర్షించాలని బీజేపీ చూస్తోందని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం అఖిలేష్ యాదవ్ తో పొత్తు పెట్టుకోవడమేనని తెలిపారు. యాదవులపై వ్యతిరేకతతో బీసీలంతా బీజేపీకి ఓటు వేశారని చెప్పారు.