: నిన్ను మిస్సయ్యాను నాన్న!.. కమల్ ట్వీట్ కు శ్రుతిహాసన్ రిప్లై


కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న దక్షిణాది నటి శ్రుతిహాసన్, ప్రముఖ హాలీవుడ్ నటుడు నీల్ గైమాన్ తో కలిసి ఓ ఫొటో దిగింది. ఈ ఫొటోను శ్రుతి తండ్రి కమలహాసన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి..‘కేన్స్ లో మరో హీరో నీల్ గైమాన్ తో నా బేబీ’ అని ట్వీట్ చేశారు. ఇందుకు రిప్లైగా ‘అంత అందమైన సాయంత్రం నిన్ను మిస్సయ్యాను నాన్నా’ అని పేర్కొంది. కాగా, కేన్స్ డబ్భైవ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా మొదటి రోజున బాలీవుడ్ తారలు దీపికా పదుకొణె, మల్లికా షెరావత్, రెండో రోజున దక్షిణాది ముద్దుగుమ్మ శ్రుతిహాసన్, మూడో రోజున ఐశ్వర్యారాయ్ బచ్చన్ రెడ్ కార్పెట్లపై నడిచారు.

  • Loading...

More Telugu News