: ఎవరెస్ట్ ను ఒక్కసారి ఎక్కడమే కష్టం.. కానీ ఈమె మాత్రం ఒకే వారంలో రెండు సార్లు అధిరోహించింది!
ఎవరెస్ట్ శిఖరాన్ని జీవితకాలంలో ఒక్కసారి అధిరోహించడమే దుస్సాహసం. అలాంటిది ఒకే వారంలో రెండు సార్లు ఈ పర్వతరాజాన్ని అధిరోహించడమంటే మాటలు కాదు. కానీ మన దేశానికి చెందిన మహిళ అన్షు (37) ఈ ఘనతను సాధించారు. ఈ నెల 16వ తేదీన ఎవరెస్ట్ ను అధిరోహించిన ఆమె... బేస్ క్యాంప్ కు తిరిగి వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుని, నిన్న మరోసారి ఎవరెస్ట్ ను అధిరోహించారు. ఇప్పటి దాకా ఆమె ఐదు సార్లు ఎవరెస్ట్ పై కాలుమోపారు. మరో విషయం ఏమిటంటే... అన్షు ఇద్దరు పిల్లలకు తల్లి.