: ఎవరెస్ట్‌పై హిల్లరీ స్టెప్ ధ్వంసం.. పర్వతారోహకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
మౌంట్ ఎవరెస్ట్‌కు ప్రయాణించే దారిలో ఉన్న ప్రముఖ ప్రదేశం హిల్లరీ స్టెప్ ధ్వంసమైంది. దీంతో పర్వతారోహకులకు ఇది ఇబ్బందిగా మారింది. ఎవరెస్ట్‌కు ఆగ్నేయంగా ఉండే 12 మీటర్ల శిలనే హిల్లరీ స్టెప్‌గా పిలుస్తారు. ఎవరెస్ట్ అధిరోహణలో ఇదే చివరి సాహసయాత్ర. 1953లో ఎడ్మండ్ హిల్లరీ దీనిపై తొలిసారి అడుగుపెట్టడంతో అప్పటి నుంచి దానిని హిల్లరీ స్టెప్‌గా పిలుస్తున్నారు. 2015లో భూకంపం కారణంగా ఇది ధ్వంసమైనట్టు బ్రిటిష్ పర్వతారోహకుడు టి మొసెడెలో పేర్కొన్నారు. ఇక అధికారికంగా హిల్లరీ స్టెప్ లేనట్టేనని ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో రాళ్లపై కంటే మంచులోనే వెళ్లడం తేలికైన పని అని, కానీ ఇకపై అక్కడ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మే, 2016లో అమెరికన్ హిమాలయన్ ఫౌండేషన్ పోస్ట్ చేసిన చిత్రాల్లోనూ హిల్లర్ స్టెప్ ధ్వంసమైనట్టు కనిపించింది. అక్కడ మంచు ఆకారం పూర్తిగా మారిపోయి ఉండడం మొసెడెలో వ్యాఖ్యలను బలపరుస్తోంది.